దిశ దారుణ హత్యపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె అన్నారు. తన కుమార్తె 2012 డిసెంబర్ 29న ఇదే విధంగా దారుణ సంఘటనలో మరణించిందని తాను ఏడేళ్లుగా న్యాయం కోసం ఆక్రందన చేస్తూనే ఉన్నానని నిర్భయ తల్లి ఆశా సింగ్ అన్నారు.
ఆరుగురు దుర్మార్గులు తన కుమార్తెపై అత్యాచారం చేసి పొట్టన పెటుకన్నారని ఆ నాటి నుంచి తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆమె అన్నారు. తన లాగా ఎవరూ న్యాయం కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదని ఆశా అన్నారు. తక్షణమే దిశకు న్యాయం జరగాలని ఆమె ఆకాంక్షించారు.