35.2 C
Hyderabad
April 24, 2024 11: 21 AM
Slider ప్రత్యేకం

రాజశేఖరరెడ్డి కొడుకు అంటే విలువలు ఉంటాయనుకున్నా

#undavallisridevi

నాకు ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత

వై ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు అంటే విలువలు ఉంటాయని భావించి మోసపోయానని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా వైసీపీ గూండాలు తనను టార్గెట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. నాకు ప్రాణ హాని ఉంది. నాకేం జరిగినా సజ్జల రామకృష్ణా రెడ్డి దే బాధ్యత అని ఆమె అన్నారు.

నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు‌. నేను దళిత ఎమ్మెల్యేను అందుకే పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు అంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. నేడు ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఒక మహిళా శాసనసభ్యురాలని లేదని.. తమ ఇంట్లో ఒక అక్కా చెల్లి ఉన్నారని కూడా చూడకుండా వైసీపీ వాళ్లు వాడే లాంగ్వేజ్ చూస్తుంటే చాలా బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ నిన్నటి నుంచి కొత్త కథలు. శ్రీదేవి ఎక్కడ అంటూ. శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ అనేది సహారా ఎడారా? లేదంటే దుబాయ్‌లోని అండర్ గ్రౌండా? నేనేమైనా మాఫియా గ్యాంగా? టెర్రరిస్టునా? అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఏంటంటే.. మొన్న డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు? నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారనేది మీకు తెలుసు.

వీరిలాగే శ్రీదేవి కూడా చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ వచ్చినట్లు ఆమె చెప్పారు. మొన్న నా పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడిని మీరు చూశారా? ఆ పెయిడ్ ఆర్టిస్టులు పార్టీ ఆఫీసుకెళ్లి ధ్వసం చేయడమేంటి? ఉద్దండరాయిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? నేనెక్కడ అడ్డు వస్తానో అని నాపై నిందలు వేస్తున్నారు. మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే నాపై కుట్రలు చేశారు. మహిళ అని చూడకుండా ఇష్టారీతిన విమర్శిస్తున్నారు. రాజధాని ఏరియాలో వాళ్లు చేసిన దందాలు, ఇసుక మైనింగ్.. మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకుని ‘‘మా గౌరవ ముఖ్యమంత్రిగారు’’ అంటారు.. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో. వీటన్నింటికీ నేనేక్కడ అడ్డు వస్తానోనని నన్ను తొలగించాలని నన్ను ప్లాన్ చేశారు. ఆ ప్రీ ప్లాన్‌లో భాగమే ఓటుకు నోటు కేసు. నేను ఓటేశానా? ఎవరికి వేశాను? అనేది తెలియకుండానే చిలవలు పలవలుగా కథనాలు వడ్డించారు.

దొంగలకే ముఖ్యమంత్రి మద్దతు పలుకుతున్నారని ఆమె అన్నారు. నేను ఓట్ చేస్తున్నప్పుడు వారెమైనా సీక్రెట్‌గా టేబుల్ కింద ఎవరైనా కూర్చొన్నారా? శ్రీదేవిని తొలగించాలని పక్కాగా ప్లాన్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా.. కుట్ర చేశారు. నా భర్త, నేనూ ఇద్దరం డాక్టర్స్. మంచి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమని అడగ్గానే ప్రజలకు సేవ చేద్దామని భ్రమపడి వెళ్లాను. ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే పదవి 5 ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తెలియదు.

ఎలక్షన్ సమయంలో గడపగడపకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడిగారు.. ‘అమరావతి ఇక్కడే ఉంటుందా?’ అని. మా జగనన్న తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇక అమరావతి రాజధాని కాకుండా ఎక్కడికి పోతుందని ధైర్యం చెప్పా. కానీ కొంతకాలంగా వారు రాజధాని కోసం ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేకపోయేదాన్ని. అమరావతిలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా చేశారా?

అభివృద్ధి పేరుతో వేల కోట్లు నొక్కేశారు. నాకు ఏపీకి రావాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఎస్సీలపై జరుగుతున్న దాడులు. ఎమ్మెల్యేగానే నేను భయపడుతుంటే.. సామాన్యులు తిరగగలరా? అని శ్రీదేవి ప్రశ్నించారు.

Related posts

108 దేవాలయాల్లో విడుదలైన శ్రీ లక్ష్మీ సహస్ర చిత్రం పాటలు

Satyam NEWS

ఔటర్ పై ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

Satyam NEWS

శ్రమజీవుల చెమట చుక్కలే అభివృద్ధికి ఆలంబన

Satyam NEWS

Leave a Comment