31.2 C
Hyderabad
April 19, 2024 06: 40 AM
Slider కరీంనగర్

పోలీసు కేసులకు భయపడేది లేదు: మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్

#rspraveenkumar

కోట్ల మంది బాగుపడాలని తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

పదవి విరమణ చేసి వచ్చిన తర్వాతి రోజునే కరీంనగర్ లో తన పై పోలీసులు కేస్ పెట్టారని అయితే అలాంటి వాటికి తాను భయపడనని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

బడుగు బలహీన ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ హుజరాబాద్ లో దళిత బంధు కోసం ఖర్చు పెట్టే వెయ్యి కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

‘‘ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు.. మనము అంత పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందాము.. దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం వచ్చి మళ్ళీ మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయకండి… మనం అంత కలిసి అధికారం దక్కించుకోవాలి..ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము మళ్ళీ వెయ్యి ఏళ్ళు వరకు రాదు’’ అని ఆయన అన్నారు.

‘‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళిలా ఉంది…ఆ బతుకులు మార్చడానికే నేను నా పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి వచ్చాను…’’ అంటూ ప్రవీణ్ కుమార్ స్పష్టతనిచ్చారు.

Related posts

జగన్ కు పోటీగా ఏపిలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందా???

Satyam NEWS

కంటైన్ మెంట్ జోన్: ఈ ప్రజలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది?

Satyam NEWS

ప్రసవ సమయంలో పొరబాటు: పసికందు తలకు గాయం

Satyam NEWS

Leave a Comment