37.2 C
Hyderabad
March 29, 2024 20: 46 PM
Slider ఖమ్మం

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి

#ministerpuvvada

ఐఏఎస్ అధికారి….. అంటే…. సకల సౌకర్యాలూ ఉంటాయి… పుష్కలంగా ప్రభుత్వ అండదండలు ఉంటాయి… అండదండలేంటి? ప్రభుత్వమే వారిది. అలాంటి ఒక ఐఏఎస్ అధికారి మరో ఐపిఎస్ అధికారిని పెళ్లి చేసుకుంటే…. ఇక సౌకర్యాలకు కొరతే ఉండదు…. ఇలాంటి ఒక ఐఏఎస్, ఐపిఎస్ లు అన్ని సౌకర్యాలూ కాదని…. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు…. నమ్మగలరా? నమ్మలేరు…

అయితే ఐఏఎస్ అధికారిణి ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహాలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ASP శబరిస్ చేసిన పని అందరికి స్ఫూర్తినిస్తుంది. స్నేహలత ప్రసవం కోసం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా, శిశు కేంద్రంలో చేరారు. అక్కడ ప్రసవ సేవలు పొంది ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఖమ్మం జిల్లా ఆదనపు కలెక్టర్ స్నేహాలత. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆసుపత్రికి వచ్చి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. జిల్లా ఉప పరిపాలన అధికారి అయినప్పటికీ సామాన్యుల లాగా, ప్రజల్లో ఒక్కరిలా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అసేవలు పొంది, ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, DM&HO మాలతి, సూడా చైర్మన్ విజయ్, వైద్యులు తదితరులు ఉన్నారు.

Related posts

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిలి సై

Bhavani

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఐదు నెలల నుంచి జీతాల్లేవ్

Satyam NEWS

Leave a Comment