27.7 C
Hyderabad
March 29, 2024 03: 13 AM
Slider మెదక్

మోడల్ విలేజ్: మొక్కలుగా మొలిచిన అభిమానం

#Ibrahimpur

” సిద్దిపేట నా కుటుంబం.. మీలో ఒక కుటుంబ సభ్యున్ని… నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం సిద్దిపేట ప్రజలపైనే ఉంటుంది… పక్షి ఎక్కడ ఉన్నా రాత్రి కి గూడుకు చేరుకుంటుంది.. నేను ఎక్కడ ఉన్నా రాత్రి కి మాత్రం సిద్దిపేట ప్రజల గూటికే చేరుకుంటా ఇవి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి  హరీష్ రావు మాటలు…

అవును నిజమే అని ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ మాటల్ని నిజం చేశారు యన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ ప్రజలు.. హరీష్ రావు అంటే మాకు అభిమానం..ఆయన మా బిడ్డ… ఆయన మా అన్న.. ఆయన మాలో ఒకరు.. మా ఊరిని దత్తత తీసుకున్న మా కుటుంబ సభ్యుడు.

ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి అని స్ఫూర్తి నింపిన హరీష్ రావు  పుట్టిన రోజున మా ఇంట్లో మొక్క నాటి మేము స్ఫూర్తి గా నిలుస్తాం అన్నారు గ్రామ ప్రజలు. హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా  ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటారు.

ఈసారి  గ్రామం లో 300 ఇళ్లు ఉండగా ఇంటికో జామ, ఇతర పండ్ల  మొక్క తమ కుటుంబ సమేతంగా నాటి స్ఫూర్తి ని చాటుకున్నారు.. మా హరీష్ అన్న కు ఇచ్చే ఉడుత భక్తి గా ఒక బహుమానం అని సంతోష పడుతున్నారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కోడూరి దేవయ్య ఉప సర్పంచ్ వంక దేవయ్య వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ఆన్ని కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు అందరు కలసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

విజయవాడలో పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు

Satyam NEWS

ముస్లిం సోదరుల అజ్మీర్ యాత్ర సఫలీకృతం కావాలి

Bhavani

లక్కీ ఛాన్స్: కార్పొరేట్ వర్గాలకు తీపి కబుర్లు

Satyam NEWS

Leave a Comment