37.2 C
Hyderabad
March 28, 2024 18: 20 PM
Slider నిజామాబాద్

ఫైనల్ టెస్టింగ్: అసలు కరోనా వ్యాప్తికి కారణాలు ఏమిటి?

#ICMR Blood Samples

కరోనా వ్యాప్తిని తెలుసుకునేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది. జిల్లాల వారిగా సర్వే చేపడుతూ రక్త నమూనాలు సేకరిస్తోంది. అందులో భాగంగా నేడు కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఐసిఎంఆర్ బృందం ఐదు బృందాలుగా విడిపోయి రక్త నమూనాలు సేకరించడం ప్రారంభించింది.

కామారెడ్డి జిల్లాలో ఐసీఎంఆర్ బృందం పర్యటించింది. ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జిల్లాలోని 10 మండలాలలో సర్వే చేపట్టి 400 మంది నుంచి  రక్త నమూనాలు సేకరించనుంది. నేడు జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, మాచారెడ్డి, రాజంపేట, ఎల్లారెడ్డి మండలాలలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తోంది.

ఒక్కొక్క ప్రాంతంలో నాలుగు బృందాలుగా విడిపోయి ఒక్కో బృందం 10 మంది వద్ద రక్త నమూనాలు సేకరించింది. ఐసీఎంఆర్ బృందం చేపట్టే రక్త నమూనా సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి నుంచి శాంపిల్ సేకరించారు. ఈ సందర్బంగా ఐసీఎంఆర్ కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని 80 జిల్లాల్లో ఐసీఎంఆర్ బృందం రక్త నమూనాలు సేకరిస్తుందన్నారు.

దేశంలో కరోనా కేసులు నమోదు కానీ ఆరెంజ్, రెడ్ జోన్ ప్రాంతాల్లో ఈ సర్వే కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో ముందుగా సర్వే కొనసాగుతుందని తెలిపారు. 18 సవత్సరాల పైబడి, 70 సంవత్సరాల లోపు వయసున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ శాంపిల్స్ ఐసీఎంఆర్ స్టాండడైజ్ సంస్థ నుంచి చెన్నైకి పంపిస్తామని, అక్కడి నుంచి ఢిల్లీకి పంపిస్తామని అన్నారు. ఈ సర్వేలో డబ్ల్యూ.హెచ్.ఓ కన్సల్టెంట్ స్నేహ శుక్ల, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తం

Satyam NEWS

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

Satyam NEWS

శ్రీకాకుళం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment