28.7 C
Hyderabad
April 20, 2024 08: 41 AM
Slider జాతీయం

ఒమిక్రాన్‌ గుర్తింపుకు ఐసీఎంఆర్ సరికొత్త కిట్‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు సరికొత్త కిట్‌ను తయారు చేసింది భారత వైద్య పరిశోధన మండలి. దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. దీనిపై పేటెంట్‌ హక్కులు, కమర్షియల్‌ హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

అయితే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న వారికి కిట్‌ను తయారు చేసి విక్రయించుకునే అధికారాన్ని ఇస్తామని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు దేశంలో ఎలాంటి కిట్లు లేవు. ఈ వేరియంట్‌ అనుమానిత వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.

దీంతో ఫలితాలు వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతోంది. ఇప్పుడు ఐసీఎంఆర్‌ కిట్‌ను తయారు చేయడంతో ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

Related posts

ముంపు గ్రామాల ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

మతం మార్చిన ఎపిసోడ్: చివరకు క్షమాపణలు

Satyam NEWS

శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్‌

Bhavani

Leave a Comment