32.2 C
Hyderabad
March 28, 2024 23: 00 PM
Slider చిత్తూరు

తుంగభద్ర పుష్కరాలకు పురోహిత బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు

#TirupathiBrahmins

తుంగభద్ర నది పుష్కరాలలో సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న పౌరోహితులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నదని తిరుపతి నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు గుండాకరం విజయ భాస్కర్ శర్మ  తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో పురోహిత బ్రాహ్మణులకు ఉచిత గుర్తింపు కార్డులు ఇస్తున్నదని ఆయన తెలిపారు.

తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్నాయని ఆయన వివరించారు. తుంగభద్ర నది ఘాట్ లలో యజ్ఞ, యాగాది, క్రతువులు, పిండప్రదానాలు, తర్పణాలు చేయడం దానాలు ఇవ్వడం మన సంస్కృతి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమాలలో పాల్గొనాలంటే పురోహిత బ్రాహ్మణులు కచ్చితంగా ఈ ఐడి కార్డు పొంది ఉండాలని ఆయన తెలిపారు. గుర్తింపు కార్డులను పొంద దలచినవారు తమను సంప్రదించాలని  విజయ భాస్కర్ శర్మ కోరారు.

తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆధార్ జిరాక్స్ తో పాటు రెండు ఫోటోలు అందజేసి, దరఖాస్తు ఫారం పూర్తి చేసి, తమ వద్ద ఐడి కార్డును ఎటువంటి రుసుము లేకుండా పొందవచ్చునని తెలిపారు.

ఇతర వివరాలకు 9948239205, 9515579935 కి సంప్రదించాలని కోరారు.

Related posts

సిద్దిపేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి

Satyam NEWS

కరీనా వారియర్ ప్రశంస పొందిన కువైట్ కడప వాసి

Satyam NEWS

న్యూ ప్రాబ్లమ్: అడ్డు తప్పుకోండి అయ్యప్ప మా దేవుడు

Satyam NEWS

Leave a Comment