39.2 C
Hyderabad
March 29, 2024 15: 19 PM
Slider కరీంనగర్

దళితబంధు ప్రారంభించక పోతే చర్యలు

#karimnagar

దళితబంధు పథకం ద్వారా లబ్ధిని పొంది యూనిట్లను స్థాపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించేవారికి నోటీసులను జారీ చేయాలని,అప్పటికీ స్పందించకపోతే దళితబంధును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్జన్ తెలిపారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు యూనిట్ల మంజూరీపై సంబంధిత క్లస్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కర్జన్ మాట్లాడుతూ జిల్లాలో యూనిట్ల మంజూరులో అధికారులు పరిశీలించిన తరువాతే తదుపరి అనుమతులు ఇవ్వాలని, యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ కెఎస్ సర్వేలో ఉండి ప్రస్తుతం కూడా ఉన్నవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి పథకం మంజూరుకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారులుగా జీవించేవారికి, వృద్ధులకు, మనవండ్లు, మనవరాళ్లకు పథకం మంజూరు చేయరాదని సూచించారు. తక్కువ ఆదాయం ఉన్న రిటైర్డు ఉద్యోగులకు, కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ వారికి పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు.సరైన పత్రాలను,ఆధారాలను చూపించనివారి దరఖాస్తు తిరస్కరించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.

దళితబంధు పథకం మొదలయ్యిక ఇప్పటికి సంవత్సరం పూర్తయిన కూడా దళితబందు తీసుకున్న లబ్ధిదారులు చాలామంది వారికి కేటాయించిన యూనిట్లను ప్రారంభించకపోవడంతో అలాంటి వారిపై యాక్షన్ తీసుకొని కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.చాలా మంది దళితబందు లబ్ధిదారులు డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుంటూ దళితబంధు డబ్బులను పక్కదోవ పట్టిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.ఉద్యోగాలువీటిపైన స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించలేదో వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related posts

పేద‌ల ప‌క్షాన పోరాడేది క‌మ్యూనిస్టే!

Sub Editor

శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీల్లో పరిస్థితి అస్తవ్యస్తం

Satyam NEWS

తిరుపతిలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయం

Bhavani

Leave a Comment