భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో కొల్లాపూర్ లోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మూఢ నమ్మకాల పై నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత నాస్తిక సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి మొండేల రాజేష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సైకాలజిస్ట్ బైరి నరేష్ మాట్లాడుతూ రోజురోజుకు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మూఢనమ్మకాలు వీడితేనే అభివృద్ధి చెబుతామన్నారు. విద్యార్థులలో భయాలు అపోహలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు.
కాళ్ళకి నల్ల దారాలు కట్టుకోవడం, అనారోగ్యం వస్తే భూత వైద్యుని ఆశ్రయించడం చేస్తున్నారు అన్నారు. వాటివల్ల ఉపయోగం లేదు అన్నారు. దయ్యాలు భూతాలు ఉండవని వాటిని నమ్మి భయపడవద్దు అన్నారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ ను సంప్రదించాలి తప్ప మూడనమ్మకాలు నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అన్నారు.
ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తల జీవిత త్యాగాలను గుర్తు చేశారు. చెడుకు దూరంగా ఉండాలని మూఢనమ్మకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రమేష్, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచ్యుత రాజ్, భారత నాస్తిక సమాజం నాయకులు సుమంత్ , భరత్, శివుడు, రాజశేఖర్, నర్సింహ, వంశీ, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. (భారత నాస్తిక సమాజం, రాష్ట్ర అధ్యక్షుడు, బైరి నరేష్ 7013160831)