39.2 C
Hyderabad
April 25, 2024 17: 34 PM
Slider విజయనగరం

విధి నిర్వహణ పట్ల అలక్ష్యం వహిస్తే తక్షణమే తొలగించండి…!

విజయనగరం జిల్లా కలెక్టర్ యమ దూకుడు గా వెళుతున్నారు..జీతం ఎలా తీసుకుంటున్నామో చేస్తున్న వృత్తి పట్ల అలాగే ఉండాలని…విధుల పట్ల నిర్లక్ష్యం.. అశ్రద్ధ..అలసత్వం ప్రదర్శిస్తే..తక్షణమే తొలగించాలని ఆదేశాలు కూడా ఇస్తున్నారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆమె ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం హేట్సాఫ్ చెబుతోంది సత్యం న్యూస్. నెట్.ఇక కొత్త‌గా వివాహం అయిన మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా స‌ఖి గ్రూపుల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, వ్య‌క్తిగ‌త ప‌రిర‌క్ష‌ణ‌, పోష‌కాహారం, ర‌క్త‌హీన‌త నివార‌ణ‌, గ‌ర్భం దాల్చ‌డం, వేక్సినేష‌న్‌ త‌దిత‌ర అంశాల గురించి వైద్యుల ద్వారా ఈ గ్రూపు స‌భ్యుల‌కు వివ‌రించాల‌ని సూచించారు.

స్థానిక‌ కెఎల్‌పురంలోని 54వ వార్డు స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. రికార్డుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌య ప‌రిధిలోని గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిపై ఆరా తీసి, అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. గ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్లో న‌మోదు చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికీ నిర్మాణం ప్రారంభించ‌ని ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని, నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. క‌ల్యాణ‌మ‌స్తు, ఆధార్ సేవ‌లు, వేక్సినేష‌న్‌, గ‌ర్భిణిల‌కు, బాలింత‌ల‌కు పోష‌కాహార పంపిణీ, పిల్ల‌ల‌కు బ‌రువు, ఎత్తు న‌మోదు, ఆయుష్మాన్ భార‌త్‌, ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వాలు త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌తను గుర్తించారు. ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు, ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించేలా చూడాల‌ని కోరారు. ఏడాది దాటిన పిల్ల‌ల‌కు మీజిల్స్ టీకాను త‌ప్ప‌నిస‌రిగా వేయించాల‌ని సూచించారు.

విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల‌ నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించే వ‌లంటీర్ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్ల‌లోకి ఎఎన్ఎం, ఆశా త‌దిత‌ర ప్ర‌భుత్వ సిబ్బందిని అనుమ‌తించ‌క‌పోవ‌డంప‌ట్ల ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అపార్టుమెంట్ల‌లో నివాసం ఉంటున్న గ‌ర్భిణులు, బాలింత‌ల‌కు వేక్సినేష‌న్‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణకు సంబంధించిన అంశాలు చేర‌డం లేద‌ని అన్నారు. కొన్నిచోట్ల గ‌ర్భిణులు, బాలింత‌ల వివ‌రాలు కూడా తెలియ‌డం లేద‌ని అన్నారు.

అపార్టుమెంట్ల‌లో నివాసం ఉంటున్న మ‌హిళ‌ల్లో కూడా ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా ఉంటోంద‌ని, హైరిస్క్ కేసులు పెరుగుతున్నాయ‌ని అన్నారు. ప్ర‌భుత్వ సిబ్బందిని అనుమ‌తించ‌ని అపార్టుమెంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మున్సిప‌ల్ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ఆకస్మిక త‌నిఖీలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, హౌసింగ్ పిడి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి, డిఇ రంగారావు, ఎఈ శ్రీ‌నివాస‌రావు, స‌చివాల‌యాల జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త అశోక్‌, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మళ్లీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరో మారు ప్రమాణం

Satyam NEWS

నేడు ఆకాశంలో కనువిందు చేయనున్న పెద్ద చందమామ

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో వైసీపీపై మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

Satyam NEWS

Leave a Comment