Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: ఇఫ్కో ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

#IFCO

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ సహకార  సంఘంలో ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో విటమిన్ C  టాబ్లెట్లు,మాస్క్ లు  పంపిణి  చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ వారు అందజేసిన  100 మాస్కులు,విటమిన్ C టాబ్లెట్లను శుక్రవారం సొసైటీ చైర్మన్ శాంతీశ్వర్ పటేల్, సీఈవో భరత్ లు రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శాంతీశ్వర్ పటేల్ కరోనా మహమ్మారి పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పంట కొనుగోళ్ళ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు.ఇప్పటికే వరి ధాన్యం అమ్మిన డబ్బులు చాలా మంది రైతుల ఆకౌంట్లో పడ్డాయని తెలిపారు.

అందరూ ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు.ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే ప్రతిఒక్కరూ మాస్క్ తప్పకుండా ధరించాలని, ప్రతి అరగంటకోసారి చేతులు మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో  విశాల  సహకార  రైసుమిల్  మేనేజర్  మల్లుగొండ, జల్లపల్లి  ఇంచార్జ్  కేశ శంకర్, దత్తు భాస్కర్, రాజు,ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్స్,  సహకార సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జంగా

Satyam NEWS

ఈ కమిటీలు మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాయా?

Satyam NEWS

కాంగ్రెస్ సభకు పోలీసుల అనుమతి

mamatha

Leave a Comment