37.2 C
Hyderabad
March 29, 2024 17: 42 PM
Slider గుంటూరు

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

nrt school

నవంబర్ 27న చిలకలూరిపేట ఏ ఎం జి ఆవరణలో గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 బాల బాలికలకు ఖోఖో జిల్ల స్థాయి ఎంపిక జరిగింది. ఇందులో పాల్గొనేందుకు జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా పాఠశాలలకు చెందిన సుమారు 600 మంది పాల్గొన్నారు.

వారిలో నరసరావుపేట ఐగ్రో ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన కొత్తూరి భవ్య ఆరవతరగతి బాలికల విభాగంలోనూ, వెల్లంకి నమిత్ కృష్ణ ఐదవ తరగతి బాలుర విభాగంలోనూ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఐగ్రో పాఠశాల చైర్మన్ పల్లబోతుల వెంకట్ మాట్లాడుతూ చదువుతో బాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా విద్యార్ధులు ధృఢంగా ఉంటారని తెలిపారు.

గెలిచిన వారు గర్వ పడవద్దని, అదే విధంగా ఓడిన వారు నిరుత్సాహ పడవద్దని గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడమే క్రీడీ స్ఫూర్తి అని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పింది విని చదువుకుంటున్న పాఠశాలకు, పుట్టిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్ధినీ విద్యార్ధులకు పిలుపునిచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ పసుపులేటి రఘు బాల మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.

Related posts

ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగనున్నరేవంత్ రెడ్డి

Satyam NEWS

బోనమెత్తిన కనకయ్య

Bhavani

జగన్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కనిపించదా ఉండవల్లీ?

Satyam NEWS

Leave a Comment