ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల తల రాతలు మాత్రం మారడం లేదని TUWJ ( IJU ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ అన్నారు. ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, ఇతర సమస్యలు తీరుస్తామని ఎన్నో వేదికల మీద హామీలు గుప్పించి ఆశల పల్లకీలో ఊరేగించారని, ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించే లేదని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇక పోరు బాట పట్టాల్సిందేనని నిర్ణయించిన టీయూడబ్ల్యుజె (ఐజేయూ) దశల వారీగా పోరాటాలకు సిద్ధమయ్యిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాచేయాలని అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రాలను సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 4న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ధర్నా చేసి ఆర్డీవో కు వినతి పత్రాలను సమర్పిస్తామని 14వ తేదీన జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాచేసి జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందచేస్తామని ఆయన తెలిపారు.జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 239 జీ వో రద్దుచేసి జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని, ఇళ్ళు.. ఇళ్ళ స్థలాలు సమకూర్చాలని, అందరికీ హెల్త్ కార్డులు జారీ చేసి అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో వాటిని అంగీకరించి చికిత్స అందించే లా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
previous post