32.7 C
Hyderabad
March 29, 2024 10: 33 AM
Slider నల్గొండ

ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

cpi ikp

ప్రతి గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని, రూ. 2500లకు సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు, ఉస్తెల నారాయణరెడ్డి, ధూళిపాల ధనంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సన్నరకం వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ వేయమని, రైతు బంధు పథకం వర్తింపు చేయమని, రైతాంగాన్ని బెదిరించి, రైతు పండించిన ధాన్యాన్నిఇప్పుడు కొనుగోలు చేసే నాథుడే లేడని, తక్షణమే సన్నరకం ధాన్యాన్నిక్వింటాలుకు 2500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


అతివృష్టి కారణంగా వరి పంట పొలాలు చీడ తెగులు బారినపడి దిగుబడి భారీగా తగ్గిందని, పండిన కొద్ది పంట ధాన్యాన్నికూడా కొనకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పాలు చేయటం సరైనది కాదని, రాబోయే యాసంగి పంటకు రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని వారు డిమాండ్ చేస్తూ ఆర్డీవోకి వినతి పత్రం అందించారు.


ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రమేష్, రైతు సంఘం నాయకుడు జక్కుల రమేష్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి, ఉపాధ్యక్షురాలు A.లక్ష్మి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అమరారపు పున్నయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, యల్లావుల ఉమ, బాదే నరసయ్య, చిలకరాజు గంగయ్య, సోమగాని కృష్ణ, ఇందిరాల వెంకటేశ్వర్లు, గురవారెడ్డి, కడియాల అప్పయ్య, గోవిందు, నరాల భాస్కర్, కొమ్ము మోహన్ రావు, దేవరం సుజాత, బండారు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత

Satyam NEWS

రేపు బీసీ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకరమహోత్సవం

Satyam NEWS

ఇన్ స్టా గ్రాం కిలాడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేసింది

Satyam NEWS

Leave a Comment