ఇళయదళపతి విజయ్ దీపావళికి బిగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకి కాస్త సమయం ఉండగానే విజయ్ తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. విజయ్ 64 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి లోకేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తితో ఖైదీ సినిమాని తెరకెక్కించి బిగిల్ సినిమాకి పోటీగా వదులుతున్న లోకేష్ తోనే విజయ్ సినిమా చేయడం ఆశ్చర్యం. గత నెలలో పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. పేట సినిమాలో రజినీకాంత్ స్నేహితుడి భార్యగా నటించిన మలయాళ భామ మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సోలో హీరోయిన్ గా మాళవికకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈ జనరేషన్ హీరోల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, విజయ్ సినిమాలో విలన్ అనగానే అంచనాలు మరింత పెరిగాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.
previous post
next post