24.2 C
Hyderabad
December 10, 2024 00: 18 AM
Slider సినిమా

తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా?

5369_ileana-dcruz

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఇలియానా అతడితో కటీఫ్ చెప్పినట్లే కనిపిస్తున్నది. ఇన్ స్టా గ్రామ్ తదితర సోషల్ మీడియా నుంచి ఆండ్రూ ను అన్ ఫాలో చేసిన ఇలియానా ఇప్పుడు  మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నది. పోకిరి సినిమాతో తెలుగు తెరపై మెరిసి తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి పక్కన నటించింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లకే టాప్ చైర్ రీచ్ అయిన ఇలియానా, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా, ఇప్పుడు అక్కడ కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంది. అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత ఏ మూవీ సైన్ చేయని ఇలియాన ఒక క్రేజీ ఆఫర్ పట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకి కమర్షియల్ హంగులు అద్దడంలో దిట్ట అయిన కొరటాల శివ, చిరంజీవి కలయికలో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లు వినిపించినా కూడా కొరటాల శివ, ఇలియానాకే ఓటేశాడని తెలుస్తోంది. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో ఇలియానా తన పాత మెరుపులు మళ్లీ చూపిస్తుందేమో చూడాలి.

Related posts

తెలంగాణ జనసమితి ఇంచార్జీ గా దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Satyam NEWS

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ

Satyam NEWS

తిరుగుబాటు ఎంపికి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు

Satyam NEWS

Leave a Comment