27.7 C
Hyderabad
March 29, 2024 04: 18 AM
Slider ప్రకాశం

జగనన్నా… ఏపీ మోడల్ స్కూల్ ని కాపాడండి

#apmodelschool

స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి- నాడు నేడు  కార్యక్రమం కొంతమంది టీచర్ల అవినీతి కారణంగా మసకబారుతోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్ల వారి పాలెం  ఏపీ మోడల్ స్కూల్  లో జరుగుతున్న అవినీతి అక్రమాలు అందుకు ప్రత్యక్ష నిదర్శనం.

నాడు నేడు కార్యక్రమంలో రెండు దఫాలు మంజూరైన లక్షల రూపాయల నిధులలో గోల్ మాల్  జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్లో సుమారు 500 మంది  విద్యార్థినీ విద్యార్థులు ఉండగా 150 మందికి మాత్రమే రేషన్ వినియోగించి మిగిలిన 350 మంది రేషన్ కైంకర్యం చేస్తున్నట్లు  స్కూలు సిబ్బంది, స్థానికులు ఆరోపిస్తున్నారు.

సుమారు 100 మంది పిల్లలు ఇంటి నుండి క్యారేజీ తీసుకుని వెళుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజువారి ఇవ్వవలసిన చిక్కి, కోడిగుడ్డు మినహాయించి పెద్దమొత్తంలో నిధులను మిగుల్చు కుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

సెప్టిక్ ట్యాంకు ప్రక్కనే వాటర్ ట్యాంకులు నిర్మించి శుభ్రత లేని నీటిని వినియోగిస్తూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని పేరెంట్స్ కమిటీ ఆరోపిస్తోంది. స్కూలు ఆవరణలోని ఆర్ఓ ప్లాంట్ ను విద్యుత్ మెయిన్ ప్యానెల్ బోర్డు ప్రక్కనే నిర్మించడం ద్వారా విద్యార్థినీ విద్యార్థులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉందని పేరెంట్స్ కమిటీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికీ, “మీరేంటి మీ కులం ఏంటి, నా ముందు కనీసం నిలబడే అర్హత లేని మీరు నాకు సలహా ఇస్తారా?”  అంటూ అసభ్యకరమైన మాటలతో దూషిస్తున్నారని పేరెంట్స్ కమిటీ వాపోతోంది.

స్కూల్లో విద్యార్థులు చేసే చిన్న చిన్న తప్పులకు పొరపాట్లకు విద్యార్థులను కౌన్సిలింగ్ చేయకుండా, స్థానిక పోలీసులను పిలిపించి విద్యార్థులను శారీరకంగా మానసికంగా వేధించడమేకాకుండా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్కూలు సమస్యలను పేరెంట్స్ కమిటీ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ స్కూలు వ్యవహారంపై దృష్టి పెట్టి ఏపీ మోడల్ స్కూల్  ని అక్రమాల బారినుండి కాపాడవలసిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఏపీలో ఒకే సారి 14 మంది కలెక్టర్ల బదిలీ…

Satyam NEWS

గ్రూప్-4 దరఖాస్తుల గడువు పొడిగింపు

Murali Krishna

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ చదలవాడ

Satyam NEWS

Leave a Comment