జాగా కనిపిస్తే చాలు పాగా వేశారు. కుంటలను కూడా వదల లేదు భూకబ్జా కోర్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన అధికారులు కూల్చి వేతలు చేపట్టారు. రాజేంద్రనగర్ లోనిశివరాంపల్లి పరిధిలోని బౌంరుకౌన్ దౌల కు చెందిన 18 ఎకరాల చెరువులో 5 ఎకరాల వరకు కొందరు కబ్జా చేశారు. ప్రభుత్వంలో రాజకీయ అండదండతో మాకు తిరుగు లేదనుకుని చెరువు కుంటలను కబ్జా చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు అక్రమర్కులు.
ఒక బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంత అక్రమణ జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్, అధికారులు కళ్లు మూసుకున్నారు. వారి అండదండలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ దందా ఇంతకాలం కొనసాగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలపై చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో బహదూర్ పురా ఎంఎల్ఏ ముబిన్ కు సంబంధించిన భవనాలుఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున నుండి సుమారు 50 అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. భారీ బందోబస్తు మధ్యలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.