కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చె౦డేగా౦ వద్ద మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కా పాకెట్లు సమాచారాన్ని జుక్కల్ పోలీసులకు తెలియడంతో వారు ఆకస్మికంగా తనిఖీ చేసి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు ముప్పై వేల వరకు ఉంటుందని జుక్కల్ ఎస్సై మహమ్మద్ రఫీ ఉద్దీన్ తెలిపారు.
సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ మండలం పరిసర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని, ఎవ్వరు కూడా గుట్కా, గంజాయి పేకాట తదితర నిషేధిత కార్యక్రమాలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.