39.2 C
Hyderabad
April 25, 2024 16: 54 PM
Slider రంగారెడ్డి

అక్రమ భూములతో లేఅవుట్లు:అవస్థల పాలవుతున్న ప్లాటు ఓనర్లు

#illegalland

చెరువు భూమి అయినా, అసైన్ మెంట్ భూమి అయినా ఇలా ఏ భూమి అయినా సరే అధికారులు కళ్లు మూసుకుని లే అవుట్లు మంజూరు చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారులోని అమీన్ పూర్ మండలం, నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ లోని 1128 సర్వే నంబరు ఒక  రైతు వారి పట్టా పధకం భూమి గా మార్పు చెందిన  ఇనాం  భూమి.

ఈ 1128 సర్వే నంబరు డాక్యుమెంట్ లోని 54 గుంటలు స్థలం నిబంధనలకు విరుద్ధంగా 2003 సంవత్సరంలో లేఅవుట్ పార్టనర్ విఠల్ గోపాల్ భూమిని కొని, ఇదే సంవత్సరం లో 1996  ఆమోదించబడిన నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ లో అనుబంధం చేశారని నరేంద్ర నగర్ కాలనికి చెందిన సీనియర్ సీటిజెన్ కోటేశ్వర రావు తెలిపారు. అసలు ఈ భూమి ఇనాం భూమిగా రికార్డులలో ఉంది ఇనాం భూములు నిషేధించిన తర్వాత, ఆ భూమి ప్రభుత్వ పరమైంది. ఆ తర్వాత దాన్ని రైతు వారి పట్టా పధకం భూమి గా మార్చారు.

ఇక్కడ ఈ భూమిని రైతు వారీ పట్టా భూములు గా  వ్యవసాయం కొరకు లబ్ది పొందిన వారి కి టైటిల్ హక్కులు కూడా  పొందకుండానే, అర్హత లేకుండానే ఈ భూమిని 2001 సంవత్సరం లో లేఅవుట్ పార్టనర్ సత్యనారాయణ గౌడ్ కు అమ్మారు. తిరిగి ఇదే లేఅవుట్ లోని ఇంకొక పార్టనర్  విఠల్ గోపాల్ కు ఇదే స్థలాన్ని అమ్మటం జరిగింది. ఇది చట్ట రీత్యా నేరం మని కోటేశ్వర రావు తెలిపారు.

ఇలా మధ్యంతరంగా లేఅవుట్ లోని భూములను, లాటులుగా భూములను అమ్మాలన్నా,కొనాలన్నా గ్రామ పాలక  సంఘం గ్రామ సభ ఆమోదం తప్పని సరి. అలా చేసిన తర్వాతనే ప్రభుత్వం అనుమతిస్తుందని చట్టాలు సూచిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఈ 1128 సర్వే నంబరు భూమి సాంబి చెరువు సరి హద్దుల్లో ఉంది. ఇది ఒక చెరువు తీరం భూమి గా ఉండటం వలన, గత  ఇ నాం భూమి రికార్డులను బట్టి దీనిని ఒక ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనల్ భూమి గా  భావించటం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ భూమిని కొన్న విఠల్ గోపాల్ పేరున పట్టా నంబరు ట్రాన్సఫరు కాక పోవటం, భూమి ఉనికి తెలిపే లింకు డాక్యుమెంటు లేక పోవటం ప్రధాన కారణం అయి ఉండ వచ్చునని కోటేశ్వర రావు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆక్రమణలు చోటు చేసుకోవడంతో బాటు అనేక కారణాలతో ఈ 1128 సర్వే నెంబరును 2007 సంవత్సరం నుండి నిరవధికంగా ప్రభుత్వం ప్రొహిబిషన్ లో ఉంచింది.

ఈ కారణం గా లేఅవుట్ లోని ప్లాటు ఓనర్లే ఇబ్బంది పడతారని అందరికి తెలిసిన సత్యం. ఇలాంటి అక్రమ లేఅవుట్ లకు గుడ్డిగా అనుమతులు ఇవ్వటం  సక్రమం కాదని ఆయన వివరించారు. దీనివల్ల ప్లాటు ఓనర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కోటేశ్వర రావు తెలిపారు.

Related posts

అన్ని ఎన్నికలూ పూర్తి చేసి ఇప్పుడు పన్నుల పెంపు

Satyam NEWS

ఎవరినీ నిందించను.. పోటీ చేయటం పక్కా… తుమ్మల

Bhavani

ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment