38.2 C
Hyderabad
April 25, 2024 12: 55 PM
Slider ముఖ్యంశాలు

వాటర్ ప్లాంట్ యజమానులకు హెచ్చరిక.. అనుమతి లేకుంటే సీజ్

తాగునీరు తోనే ప్రజల ఆరోగ్య భద్రత ఉంటుందని కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య పేర్కొన్నారు. కమిషనర్ సొంటే రాజయ్య ఏదైతే చెప్పుతారో అదే చేసి చూపిస్తారు.ఇప్పుడు అదే చేస్తున్నారు.

ఆయన కొన్నిరోజుల క్రిందట సత్యం న్యూస్ తో మాట్లాడారు.ఆరోజు మున్సిపాలిటి ప్రాంతంలో వాటర్ ప్లాంట్ లకు హెచ్చరికలు జారీ చేశారు.మంగళవారం ఆయన 13వ వార్డులోని వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు.నిర్వాహకులపై సీరియస్ అయ్యారు.ఇక పై సూచననలు పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అనుమతులు తీసుకోకుంటే సీజ్ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతక ముందు మున్సిపాలిటి పరిధిలోని అనుమతులు లేని వాటర్ ప్లాంట్ లకు అధికారులు శానిటేషన్ ఇన్ స్పెక్టర్ నరేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ జమిర్,బిల్ కలెక్టర్లు నాగరాజు,ఏజాజ్, బాల కృష్ణ ఫైన్ విధించారు.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS

ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ ఓపెన్ హౌస్

Satyam NEWS

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Satyam NEWS

Leave a Comment