27.7 C
Hyderabad
April 25, 2024 07: 04 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎడతెరిపిలేని దాడులు

#Kollapur Exices Police1

కరోనా కేసులు పెరుగుతున్నా ఎక్సైజ్ పోలీసులు తమ విధి నిర్వహణలో ముందుకు వెళుతూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో నాటు సారా వ్యాపారం మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులకు పని భారం మరింత పెరిగింది.

అయినా పరిస్థితులతో రాజీ పడకుండా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ పొలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. కొల్లాపూర్  నియోజకవర్గ ప్రాంతంలోని పెంట్ల వెల్లి, కోడేర్, కొల్లాపూర్ మండల ప్రాంత (తాండ) గ్రామలలో నాటు సారా తయారు అవుతున్న  స్థావరాల పై ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు సిబ్బందితో దాడులు ముమ్మరంగా చేస్తున్నారు.

సారాకు కేరాఫ్ గా ఉన్న తాండాలను సిఐ ఏడుకొండలు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారు. ఈ మధ్యలోనే కొల్లాపూర్ పట్టణానికి చెందిన  సారా బెల్లం విక్రయిస్తున్న షావుకారుల షాపులను తనిఖీలు చేసి భారీ మొత్తంలో బెల్లాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

నల్లబెల్లం తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేశారు. నాగర్ కర్నూల్ డిటీఎఫ్ బృందం ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ నాటు సారా, బెల్లం విక్రయించాలన్న దళారులు వణుకుతున్నారు. ఇది వరకు లాక్ డౌన్ సమయంలో బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలతో  బెల్లాని సిఐ ఏడుకొండలు సీజ్ చేశారు.

లాక్ డౌన్ సమయంలో లిక్కర్ అమ్మకాలు లేనప్పుడు సారా విక్రయాలు ఎక్కువైయ్యాయి. ఆ సమయంలో కరోనా వైరస్ ను లెక్కే చేయకుండా సిఐ ఏడుకొండలు సిబ్బందితో దాడులు చేశారు. సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే విధంగా దాడులు చేస్తున్నారు.

ముఖ్యంగా సారా తయారీకి కేరాఫ్ గా ఉన్న పెంట్ల వెళ్లి మండలం వెంగంపల్లి గ్రామం (తాండ) కొల్లాపూర్ మండల పరిధిలోని సున్నపు తాండలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సమాచారం అందిన వెంటానే ఎప్పటికి అప్పుడు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

దాడులు కొనసాగుతున్నాయి. పదే పదే సారాయి తయారు చేయడం బెల్లం విక్రయాలు చేసే వారిపై ఇక పై  వెనుకడగు వెయ్యకుండా పీడీ యాక్ట్ కేసులు నమోదు చెయ్యడానికి సిద్ధమయ్యారు.

గురువారం జవాయి పల్లి, ఎంగంపల్లి, నారాయణ నాయక్, ఠాగూర్ తాండలలో  డిటీఎఫ్ బృందంతో దాడులు  చేశారు. మొత్తం మీద 900లీటర్ల బెల్లం పానకాన్ని నేలపాలు చేశారు.20లీటర్ల సారాను సీజ్ చేశారు. అయిదు కేసులు నమోదు చేసినట్లు సిఐ ఏడుకొండలు తెలిపారు.      

      

Related posts

ఉప్పల్ లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

మండుటెండలో మంత్రి కి బొత్స కు ఎన్.సీ.సీ స్టూడెంట్స్ స్వాగతం అవసరమా…!

Bhavani

టెస్టింగ్: హైదరాబాద్ కు వచ్చిన కరోనా కిట్లు

Satyam NEWS

Leave a Comment