27.7 C
Hyderabad
April 24, 2024 09: 08 AM
Slider ప్రపంచం

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

#JoeBiden

అమెరికా అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ కనీసం డజనుకు పైగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను తిరగదోడే అవకాశం కనిపిస్తున్నది. జో బైడెన్ ఎదుట అత్యంత పెద్ద సమస్యలు ఉన్నాయి.

కరోనా మహమ్మారి, ఆర్ధిక సంక్షోభం, పర్యావరణ మార్పులు, వర్ణ వివక్ష అనే నాలుగు ప్రధాన సమస్యలను జోబైడెన్ సరిదిద్దాల్సి ఉంది. కనీసం ప్రయత్నం అయినా చేయాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆరంభంలోనే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలలో దాదాపుగా పన్నెండింటిని జో బైడెన్ తిరగదోడే అవకాశం కనిపిస్తున్నది. అయితే అత్యంత స్వల్ప మెజారిటి ఉన్న కాంగ్రెస్, సెనేట్ లను దాటుకుని రెండు మూడు నిర్ణయాలు మాత్రమే అమలు చేసే వీలుకనిపిస్తున్నది.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటు కీలకం

అదీ కూడా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణయాత్మక ఓటుతోనే సాధ్యం అవుతుంది. ముందుగా జో బైడెన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నా వాటిని అమలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఓట్ల లెక్కింపు ఆలశ్యం కావడం వల్ల ఈ నిర్ణయాలను ఇప్పటి వరకూ ఆయన అమలు చేయలేకపోయారు. జో బైడెన్ పై ఆశలు పెట్టుకున్న భారతీయులు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆయన మారుస్తారని అనుకుంటున్నారు.

అత్యంత నైపుణ్యత ఉన్న వారి విషయంలో ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారతీయ ఐటి రంగ నిపుణులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

అమెరికాలో హెచ్ 1 బి విసా పై పని చేస్తున్న వారిలో తీవ్ర అనిశ్చితి ఏర్పడి ఉంది. జీతాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం, దేశాలకు విధించిన వీసాల కోటాలోని కోతలను కనీసం ఏడు శాతానికి పెంచుకోవడం, గ్రీన్ కార్డు జారీ ప్రక్రియలలో మార్పులు జరగాల్సి ఉంది.

గ్రీన్ కార్డులపై ఆంక్షలను సడలిస్తారా?

ఇవన్నీ ట్రంప్ కేవలం కార్యనిర్వాహక ఆదేశాలతోనే చేశారు. అదీ కూడా జనవరి 12 నుంచి 15 మధ్య కాలంలోనే చేశారు. ఉద్యోగుల ఇమ్మిగ్రేషన్ విషయంలో మొదటి నుంచి స్థిర నిర్ణయంతో ఉన్న జో బైడెన్ అమెరికన్ నిపుణులకు కూడా వెసులు బాట్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు.

ఉద్యోగంపై ఆధారపడి ఉన్న గ్రీన్ కార్డు ఆంక్షలను కూడా జో బైడెన్ తొలగించే అవకాశం ఉంది. ఈ విధమైన గ్రీన్ కార్డుల కోసం ఎన్నో భారతీయ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

పర్యావరణ మార్పులకు సంబంధించి మళ్లీ పారిస్ ఒప్పందంలో చేరడం జో బైడెన్ తీసుకోబోతున్న కీలక నిర్ణయం. యువకులకు ఎక్కువ మందికి పౌరసత్వం ఇవ్వడం ద్వారా వర్ణ వివక్షకు అడ్డుకట్ట వేయాలని కూడా జో బైడెన్ అనుకుంటున్నారు. దాదాపు 13 ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను కూడా జో బైడెన్ ఎత్తివేసే అవకాశం ఉంది.

Related posts

గుడ్ న్యూస్: 400 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం

Satyam NEWS

రెండవ పంటకు నీటి విడుదల చేసిన వైస్ఎంపిపి

Satyam NEWS

బ్రాహ్మణుల శాపానికి జగన్ బలికాకతప్పదు

Satyam NEWS

Leave a Comment