32.2 C
Hyderabad
March 28, 2024 23: 57 PM
Slider ఖమ్మం

మాస్క్ నిబంధనలు కఠినంగా అమలు చేయండి

#KhammamPolice

ఖమ్మం జిల్లాలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్  సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ….కరోనా సెకండ్ వేవ్ లో వైరస్  మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్  ఉధృతిని కట్టడి చేసేందుకు  ప్రభుత్వ ఆదేశాలను అమలు

చేస్తూ బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ఖచ్చితంగా ధరించేలా ప్రతీ పోలీస్ అధికారి కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.

మాస్క్‌ ధరించడం, భౌతిక ధూరాన్ని పాటించే అంశాలపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. షాపింగ్ మాల్స్, వైన్స్,  హోటల్స్, ప్రజా రవాణాలో, బార్& రెస్టారెంట్లు, కిరాణ షాపులు. పెట్రోల్ బంకుల్లో  “నో మాస్క్ నో ఎంట్రీ”  అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని  సూచించారు.

బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో (ఆర్టీసీ & ప్రవేటు బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు)  మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా తప్పదన్నారు.

ప్రస్తుత పరిస్థితులలో ఇళ్ళ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించమే సరియైన మార్గమని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో అడిషనల్ డిసిపీ లా&ఆర్డర్  సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ డిసిపీ (AR) కుమారస్వామి , ఏసీపీలు ప్రసన్న కుమార్ , వెంకటరెడ్డి, వెంకటేశ్,  రమేష్, సత్యనారాయణ ,రామానుజం, జహాంగీర్ సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు

Bhavani

వామపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

Murali Krishna

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిజాలు దాచిపెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment