30.2 C
Hyderabad
September 28, 2023 12: 58 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై కీలక నిర్ణయం

pjimage (2)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ తన అవతరణ దినోత్సవాలను జరుపుకోవడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరిగేవి. 1956 లో దేశంలోని రాష్ట్రాల పునర్ విభజన సందర్భంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. ఆ నాటి నుంచి ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోవ్సం జరిగేది. అయితే 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం తన ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ధూంధాంగా జరుపుకుంటున్నది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం నవనిర్మాణ దీక్ష పేరుతో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోగా దాన్నిఒక నిరసన దినోత్సవంగా చేశారు. పోనీ నవంబర్ 1న అయినా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపారా అంటే అదీ లేదు. అప్పుడు ఆవిర్భవించిన రాష్ట్రం కాదు కదా అని ఆ రోజునూ అధికారికంగా పండుగ జరపలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజుల్లో ఉన్న సెంటిమెంటు అలాగే కొనసాగాలని, తెలంగాణ పై విద్వేషం అలాగే ఉండాలని చంద్రబాబునాయుడు భావించారు. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని ఎంతో మంది కోరినా ఆయన ససేమిరా అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రావడంతో ఆ పరిస్థితిని మార్చాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కూడా ముఖ్యమంత్రికి స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకపోవడం ఏమిటి? ఎందుకు జరుపుకోకూడదు? ఆంధ్రప్రదేశ్ ఇంకా రాష్ట్రంగానే ఉంది కదా? అందువల్ల నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. అందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా అంగీకరించినట్లుగా తెలిసింది. చంద్రబాబు ప్రవేశ పెట్టిన నిరసన దినాల స్థానంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల ను పునరుద్ధరించే దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తున్నది.

Related posts

ఆర్యవైశ్యుడికి మూడు లక్షల రూపాయల సహాయం

Satyam NEWS

భారత్ బంద్ పిలుపు హాస్యాస్పదం: బీజేపీ విమర్శ

Satyam NEWS

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!