36.2 C
Hyderabad
April 16, 2024 20: 29 PM
Slider అనంతపురం

అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జైలు శిక్ష

#misbehaving teacher

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష ను అనంతపురం జిల్లా స్పెషల్ కోర్ట్ విధించింది. గత ఏడాది గుత్తి లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల సాలవేముల బాబు అనే టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. క్లాస్ రూం లోనే అమ్మాయిని బలవంతం చేయబోయాడు.

కీచకుడి చర నుండి తప్పించుకొని జరిగిన విషయాన్ని ఆ అమ్మాయి తల్లికి చెప్పింది. దాంతో విద్యార్థిని తల్లి దిశ SOS కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 354(D), పోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి ఆధారాలను స్పెషల్ పోక్స్ కోర్ట్ కు దిశ పోలీసులు సమర్పించారు.

నిందితుడు సాలవేముల బాబుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమాన విధిస్తూ స్పెషల్ కోర్ట్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. తక్షణం స్పందించడంతో పాటు, నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన దిశ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

దొంగ ఓట్ల పైనే ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

చిన్న దడిగి లో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

పాటల పల్లకిలో ఐక్యూ

Satyam NEWS

Leave a Comment