పాకిస్తాన్ లోని నానక్ నా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాధ్యత వహించాలని హైదరాబాద్ లోని గౌలిగూడా సెంట్రల్ గురుద్వారా కమిటీ డిమాండ్ చేసింది. మతపరమైన దాడులు చేయడం పాకిస్తాన్ కు అలవాటని, ఆ అలవాటును పాకిస్తాన్ మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నానక్ నా సాహిబ్ గరుద్వారా పై దాడి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు మతస్థుల మనో భావాలను ఇమ్రాన్ ఖాన్ దెబ్బ తీశారని వారన్నారు. ఇందుకు నిరసనగా గౌలిగూడా గురుద్వారా కమిటీ వారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిష్టి బొమ్మను గద్ధంగా చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.