39.2 C
Hyderabad
March 29, 2024 15: 59 PM
Slider ప్రపంచం

విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఇమ్రాన్ ఖాన్

#imrankhan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి బయటపడింది. డైలీ పాకిస్తాన్ కథనం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ శనివారం ఒక ర్యాలీలో ప్రసంగించడానికి గుజ్రాన్‌వాలా వెళ్తున్నారు. ఈ సమయంలో విమానం బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించింది.

ఆ తర్వాత పైలట్ హడావుడిగా కంట్రోల్ టవర్‌ను సంప్రదించి ఇస్లామాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. అయితే ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గంలో గుజ్రాన్‌వాలాకు వెళ్లారు. గుజ్రాన్‌వాలాకు చేరుకున్న వెంటనే, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రభుత్వంలో దేశం మరియు ఆర్థిక వ్యవస్థ రక్షించబడాలంటే మీరు గళం ఎత్తాలని పిలుపునిచ్చారు.

జిన్నా స్టేడియంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్నదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే తన డిమాండ్‌ను మరోసారి ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అలా చేయకుంటే శాంతియుతంగా వీధుల్లోకి దిగి నిరసన తెలుపుతామని, లేదంటే బలవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ధిక్కార కేసులో ఇమ్రాన్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ అతనిపై అభియోగాలు మోపాలని కోర్టు నిర్ణయించింది.

Related posts

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

Satyam NEWS

పులిలా వేటాడి కేసీఆర్ ను ఒడిస్తా: రేవంత్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment