37.2 C
Hyderabad
March 29, 2024 19: 19 PM
Slider ప్రపంచం

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: అల్లకల్లోలంగా పాకిస్తాన్

#imrankhan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరు కాగా అక్కడ ఆయనను అరెస్టు చేశారు. పాకిస్థాన్ రేంజర్లు ఈ చర్య తీసుకున్నారని చెబుతున్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో హాజరయ్యేందుకు ఇమ్రాన్ హైకోర్టుకు చేరుకోగా, పాక్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత పాక్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి భగ్గుమన్నాయి. గత ఏడాది కాలంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఆర్మీ అధికారులపై, నిఘా సంస్థలపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నారని ఆర్మీ పేర్కొంది. రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం, ఐఎస్‌ఐపై నిరంతరం దాడులు చేస్తున్నారని ISPR విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.

సోమవారం అర్థరాత్రి రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఏజెన్సీలతో సంబంధం ఉన్న అధికారుల పెద్ద సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. ఈ సమావేశంలో, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్, డైరెక్టర్ జనరల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు ఐఎస్ఐకి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ముగ్గురు అధికారుల సమావేశం తరువాత, మంగళవారం ఇస్లామాబాద్‌ న్యాయస్థానానికి ఇమ్రాన్ ఖాన్ హాజరు అయిన సమయంలో అరెస్టు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తర్వాత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ గురించి పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ నుండి పాక్ ప్రధాని అజామ్, ఆర్మీ చీఫ్‌కు సమాచారం అందించారు. అప్పటి నుండి, మొత్తం పాకిస్తాన్‌లో రాజకీయ ఉద్యమం తీవ్రం కావడమే కాకుండా, లాహోర్ ఇస్లామాబాద్‌లలో సైన్యం మొహరించింది.

లాహోర్, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్ సహా పాకిస్థాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో సైన్యం మొహరించింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి జమాన్ పార్క్ నుంచి సాయంత్రం నాటికి మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతున్నది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ అంతటా నిరసనలు ప్రారంభమయ్యాయి.

ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీతో సంబంధం ఉన్న నేతలపై కూడా అరెస్ట్‌ కత్తి వేలాడుతోంది. ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన పలువురు సీనియర్ నేతలను అర్థరాత్రి వరకు కస్టడీలోకి తీసుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Related posts

కరోనా ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరిన చైనా

Satyam NEWS

ఉత్తరాఖండ్ లో తల్లీ కూతురిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లకు హైకోర్టు బ్రేక్

Sub Editor

Leave a Comment