34.3 C
Hyderabad
April 16, 2021 14: 39 PM
Slider ప్రపంచం

భారత్ తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధం

#Imrankhan

భారత్ తో ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

భారత్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అన్ని సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు.

భారత్ పాకిస్తాన్ సైనిక అధికారుల స్థాయిలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చారు. దీన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

తాము మొదటి నుంచి శాంతి కోసమే కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

Related posts

టీటీడీ నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

Sub Editor

కరోనాను అడ్డుకోవడానికి స్వీయ నియంత్రణే శరణ్యం

Satyam NEWS

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!