26.2 C
Hyderabad
March 26, 2023 11: 28 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఆంధ్రా నడిబొడ్డున కేసీఆర్ వైన్ షాప్

kcr wines

వ్యాపారం ఏముంది భాయ్ ఎవరైనా చెయ్యచ్చు. కాసింత కళాపోషణ ఉండాలి అంటున్నాడు ఆంధ్రా కేసీఆర్. వైన్ షాప్ నడపడానిక్కూడా కళాపోషణ ఉండాలా అని అడగవద్దు. ఉండాలి అంటున్నాడు ఈ కేసీఆర్. ఆ ఆంధ్రా కేసీఆర్ ఇప్పుడు ఈ ఒక్క దెబ్బతో రెండు రాష్ట్రాల్లో విఐపి అయిపోతాడు. గ్యారెంటీ. ఇంతకీ అంత పెద్దపనేం చేశాడు అనేగా మీ అనుమానం. ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు వైన్ షాపులు మూసేసి బెల్టు షాపులు తీసేసి ప్రభుత్వమే వైన్ షాపులు నడుపుతున్నది. రేపటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చేస్తుంది. మన సిఎం పెట్టిన షాపులు మన రాష్ట్రంలో నడపడంలో గొప్పేముందనుకున్న ఈ కేసీఆర్ సొంతగా తెలంగాణ సిఎం పేరుతో వైన్ షాప్ పెట్టేశాడు. జనం ఎగబడి తాగుతున్నారో లేదో కానీ ప్రతివాడూ వచ్చి బోర్డు ఒక సారి చూసి మాత్రం వెళుతున్నారట. ఇదంతా తెలంగాణ సరిహద్దులో కాదు సుమా. ఆంధ్రా నడి బొడ్డులో. నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం అనే మత్సకార గ్రామంలో  తెలంగాణ సిఎం కేసీఆర్ పేరుతో వైన్ షాపు దివ్యంగా నడుస్తున్నది. ఏపిలో చంద్రబాబు పాలన అంతం అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రా దాదాపుగా కలిసి పోయిన ఫీలింగు వచ్చేస్తున్నది. ఆ సందర్భంగా ఇక్కడ కేసీఆర్ వైన్ షాప్ వచ్చేసిందనుకుంటున్నారా? కాదు. అంతకు ముందు నుంచే ఇక్కడ కేసీఆర్ వైన్ షాప్ ఉంది. ఇంతకీ ఈ కేసీఆర్ వైన్ షాప్ ఎవరిది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? తూపిలిపాలెంలో కే చెంగారెడ్డి అని ఉన్నాడు. అతడు వైన్ షాపు పెట్టాడు. మరి ఈ వైన్ షాపు పేరు పెట్టాలి కదా అని తన పేరును షార్ట్ చేసి ఎబ్రివేషన్ లో కేసీఆర్ వైన్ షాప్ అని పెట్టుకున్నాడన్నమాట. అదీ అసలు సంగతి

Related posts

ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

Satyam NEWS

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

పంట‌ల‌కు గిట్టుబాటు క‌ల్పించాలి.. బీజేపీ

Sub Editor

Leave a Comment

error: Content is protected !!