ఆదాయపు పన్ను శాఖ ఎవరినీ అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. 2017 – 18 ఆర్ధిక సంవత్సరానికి రిటర్న్ దాఖలు చేసిన వారిలో 58,322 మందిని ఎంపిక చేసి నోటీసులు పంపింది. వీరంతా ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులకు సమాధానం ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. గత ఏడాది నోటీసులు పంపిన సంఖ్యతో పోలిస్తే ఈ సారి 30 శాతం పెంచారు. ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపిన 58,322 మందిలో ఎక్కువ మంది విదేశాల నుంచి ఆదాయం వచ్చినట్లుగా చూపించిన వారే ఉన్నారు. ఈ ఫైలింగ్ లో వీరు చెప్పిన ఈ విషయాలను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించుకోనున్నది. ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేసిన ఆరు నెలల లోపు అనుమానం ఉన్న కేసులను పిలిచి అడిగేందుకు చట్టం వెసులు బాటు కల్పిస్తున్నది. దీని ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. అవినీతి పరులైన అధికారులను నేరుగా డిస్మిస్ కూడా చేశారు.
previous post
next post