39.2 C
Hyderabad
March 28, 2024 13: 41 PM
Slider కడప

వీఆర్ఏలకు తక్షణమే వేతనం పెంచాలి….

#VRAs

వీఆర్ఏలకు వేతనాలు పెంచాలని సోమవారం కడప జిల్లా పుల్లంపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వారు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు యూనియన్ నాయకుడు వెంకటసుబ్బయ్య తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్ఏ లను చిన్నచూపు చూస్తున్నాదని ఆయన విమర్శించారు. పురాతన కాలం నుంచి వీఆర్ఏల వ్యవస్థ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.

అతి తక్కువ గౌరవ వేతనాలతో ఎంతో కాలం పని చేశారని, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు మార్కెట్ ధరలతో పోల్చితే వారి కుటుంబ జీవనోపాధికి ఏమాత్రం సరిపోవని ఆయన వివరించారు.

గ్రామ వాలంటరీ లు విఆర్ఏలు చేస్తున్న పనులు కూడా చేస్తున్న అందువల్ల వీఆర్ఏల అవసరం లేదని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పుల్లంపేట మండలం లోని వీఆర్ఏలు అందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి నిరసన కార్యక్రమాలకు అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాలు నాగ లత వారి బృందంతో వచ్చి సంఘీభావం తెలిపారు.

అత్యవసర సమయాల్లో వీఆర్ఏలు రాత్రనక, పగలనక కష్టపడి పని చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి, వారికి నెలకు 21 వేల రూపాయలు వేతనాలు నిర్ణయించి చెల్లించాలని కోరారు.

అట్లాగే వారి సమస్యలన్నీ నీ పరిష్కరించాలని, వారు పదవీ విరమణ చేసిన తరువాత వారి పిల్లలకు వి ఆర్ ఎల్ లు గా నియామకాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి వి ఆర్ ఓ అటెండర్గా నియమించాలని తెలిపారు. అదేవిధంగా డి ఎ మూడు వందల రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచాలని కోరారు.

Related posts

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎక్కడ..?

Satyam NEWS

ఎనాలసిస్: చర్చల మాటున.. చిచ్చుల బాటన…

Satyam NEWS

Leave a Comment