27.7 C
Hyderabad
April 24, 2024 07: 54 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ లో పెరిగిన ద్రవ్యోల్బణం

కేంద్రం ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష సమావేశాలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శితో మీటింగ్ పెట్టుకుని గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు.. రాబోయే కాలానికి బడ్జెట్ కేటాయింపులు తయారు చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంత్రులు, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసుకోనేవారు.. కానీ కెసిఆర్ ఆ సంప్రదాయాన్ని ఖతం పట్టించారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను పిల్చుకొని బడ్జెట్ రాసి ఇచ్చుడు తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారిగా జరిగే పరిస్థితి లేకుంట చేసిన వ్యక్తి కెసిఆర్ అని ఈటెల వ్యాఖ్యానించారు. రాచరికం లాగా వ్యవహరిస్తున్నారు తప్ప డిపార్ట్మెంట్ వారిగా నిధులు ఇవ్వటం లేదని, కేంద్ర ప్రభుత్వం తన సంప్రదాయాల ప్రకారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ సమావేశానికి డుమ్మా కొట్టారని ఈటెల అన్నారు.

అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనేది అర్థం చేసుకోవాలని ఈటెల విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అప్పు పరిధి ఇప్పటికే దాటిపోయారని రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని ఆయన తెలిపారు. గణాంకాల శాఖ దేశంలో ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే మన రాష్ట్రంలో 8.75% ద్రవ్యోల్బణం పెరిగింది అని రిపోర్ట్ ఇచ్చారు. దేశంలో నెంబర్ వన్ తెలంగాణ అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరల పెరుగుదలలో, ప్రజల నడ్డి విరవడంలో నెంబర్ వన్ అని ఆయన విమర్శించారు.

Related posts

ఫార్మర్ వెల్ఫేర్: రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ దండుమారమ్మ టెంపుల్ నిందితులు

Satyam NEWS

Analysis: రష్యా తొలి వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment