20.7 C
Hyderabad
December 10, 2024 02: 16 AM
Slider సంపాదకీయం

తెలుగు దేశానికి పెరిగిన అనుకూల ఓట్లు

#chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయి. అన్యాయంగా ఒక నేతను అరెస్టు చేశారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడమే కాకుండా ఆయనను, ఆయన కుటుంబాన్ని హేళన చేస్తూ వైకాపా తన సోషల్ మీడియా ద్వారా చేస్తున్న విష ప్రచారం వికటించినట్లుగా వెల్లడి అవుతున్నది.

టిడిపి అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని అక్ర‌మంగా అరెస్టు చేసిన త‌రువాత, ఒక్క‌సారిగా టిడిపి ఓటు బ్యాంక్ పెరిగిపోయింద‌ని ఓ స‌ర్వే తేల్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టు త‌రువాత టిడిపికి అనుకూలంగా 4.5శాతం ఓట్లు పెరిగాయ‌ని, చంద్ర‌బాబు అరెస్టు అక్ర‌మ‌మ‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎక్కుమంది భావిస్తున్నార‌ని ఆ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

మొన్న‌టి దాకా మ‌హిళా ఓట‌ర్లు ఎటువైపు ఉన్నారో ఎవ‌రికీ అర్థం కాలేద‌ని, జ‌గ‌న్ సంక్షేమ‌ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాడు క‌నుక వారంతా వైకాపా వెంట ఉన్నార‌ని వైకాపాకు చెందిన మీడియా ఊద‌ర‌గొట్టింది. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత ఆ అభిప్రాయం మారిపోయింది.

చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేసిన త‌రువాత మ‌హిళ‌లు ఆయ‌న‌పై సానుభూతి చూపిస్తున్నార‌ని, 75 ఏళ్ల చంద్ర‌బాబు ఎటువంటి త‌ప్పు చేయ‌క‌పోయినా ఆయ‌న‌ను అరెస్టు చేసి వేధిస్తున్నార‌నే భావ‌న వారిలో వ్య‌క్తం అవుతోంద‌ని ఆ స‌ర్వే చెబుతోంది. చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత ఎవ‌రూ ఎటువంటి పిలుపు ఇవ్వ‌క‌పోయినా, నాయ‌క‌త్వం వ‌హించ‌క‌పోయినా, విజ‌య‌వాడ‌, గుంటూరు ఇంకా ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో మ‌హిళ‌లు స్వ‌చ్ఛంధంగా రోడ్ల‌పైకి వ‌చ్చి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశార‌ని, వారంతా స్వ‌చ్ఛంధంగా రావ‌డంతో రాబోయే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు ఎటువైపు ఉండ‌బోతున్నారో స్ప‌ష్టం అవుతోంద‌ని స‌ర్వే సంస్థ తెలిపింది.

అదే విధంగా విద్యార్థినులు కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని, వారిలో ఒక అభిప్రాయం ఏర్ప‌డిన తరువాత వారి అభిప్రాయాన్ని ఎవ‌రూ మార్చ‌లేర‌ని, జ‌గ‌న్ నియంతృత్వాన్ని వారు స‌హించ‌లేక‌పోతున్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో మ‌హిళా శ‌క్తి ప‌వ‌ర్ ఏమిటో చూపిస్తార‌నే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

చంద్ర‌బాబు ఇంకా జైలులో ఉంటే ఆయ‌న‌కు ఇంకా మ‌ద్ద‌తు పెరిగిపోతుంద‌ని, చివ‌ర‌కు ఇది ఒక ప్ర‌జాఉద్య‌మంగా మారి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించివేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. జగన్ తన పదవీ కాలం చివరిలో రాజకీయ కక్ష తీర్చుకోవడానికే ఈ పని చేశారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని రూఢి చేసుకున్న తర్వాతే జగన్ తప్పుడు కేసులలో చంద్రబాబును అరెస్టు చేసినట్లు కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు.

Related posts

నేర నియంత్రణకు సైబరాబాద్ లో క్రైమ్ అనలిటిక్స్

Satyam NEWS

`యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్

Sub Editor

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

Satyam NEWS

Leave a Comment