పరిసరాల స్వచ్ఛతను పెంచుకోవటం, పచ్చదనం కాపాడుకోవటం ద్వారా పర్యావరణ రక్షణకు అందరూ పాటుపడాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో జరిగిన వేడుకల్లో అధికారులు, సిబ్బంది సమక్షంలో పీసీసీఎఫ్ జాతీయ జెండా ఎగురవేశారు. అటవీ సంబంధిత కార్యక్రమాలకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతను ఇస్తోందని, డిపార్టుమెంట్ లో ప్రతీ ఒక్కరూ నిబద్దత, క్రమశిక్షణతో పనిచేసి, శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని కోరారు. గత యేడాది కాలంగా మంచి పనితీరు కనపరిచిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో ఉన్నతాధికారులు సత్కరించారు. రిటైర్డ్ పీసీసీఎఫ్ బీఎస్ఎస్ రెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
previous post