27.7 C
Hyderabad
March 29, 2024 03: 31 AM
Slider కరీంనగర్

రాజన్న సిరిసిల్లా జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

#MinisterKTR

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. జిల్లా పాలాధికారి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన త్రివర్ణ పతాకావిష్కరణ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటిఆర్ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అక్కడే సిరిసిల్ల పట్టణానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సిరిసిల్ల పురపాలక సంఘ అవసరాల కోసం కొనుగోలు చేసిన 4 చెత్త ట్రాక్టర్లు, హరితహారం కోసం 2వాటర్ ట్యాంకర్లును ప్రారంభించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ టాయిలెట్స్ ప్రారంభించారు.

సిరిసిల్ల లయన్స్ క్లబ్ వారు 100 పి. పి. ఇ కిట్లు, 10 బాడీ ఫీజర్ లు, 15 శానిటైజర్ స్టాండ్స్, N95 మాస్కులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదగా  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారికి  అందజేశారు.

అనంతరం కేటీఅర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లయన్స్ క్లబ్ వారు 50లక్షల రూపాయలతో కరోనా నివారణ కోసం పిపిఇ కిట్లు, సానిటైజర్స్, మాస్క్ లు అందించి తమ ఉదాత్తతను చాటుకోవడం సంతోషదాయకమని కొనియాడారు.

సిరిసిల్లా ప్రభుత్వాసుపత్రి లో కోవిడ్ బారిన పడిన ఎనబై ఏళ్ల షుగర్ గ్రస్తురాలు కోలుకోవడం ప్రభుత్వ వైద్యుల సేవలకు నిదర్శనమని దయచేసి రాష్ర్ట వ్యాప్తంగ సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులు, 108 సిబ్బంది, ఇతర సిబ్బందికి మనందరం అండగా ఉండి వారి సేవలను గుర్తించేవిధంగా మెలగాలని సూచించారు.

కరోనా లాంటి విపత్తును ఎదుర్కోవడానికి లయన్స్ క్లబ్, ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.

Related posts

విశాఖ ఉక్కును అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Sub Editor

పెళ్లి వేడుకకు ఊటీ వెళ్లి వస్తే ఇల్లు లూటీ

Satyam NEWS

Leave a Comment