20.7 C
Hyderabad
December 10, 2024 02: 01 AM
Slider జాతీయం

జమ్మూకశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి ఢోకా లేదు

satyapal malik 1

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకశ్మీర్ లో తివర్ణ పతాకం రెపరెపలాడింది. జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురువారం షేర్-ఈ- కశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం చారిత్రక నిర్ణయం కాదని జమ్మూకశ్మీర్, లఢక్ లు అభివృద్ధి చెందడానికి ఇదో సరికొత్త మార్గం అని ఆయన పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల జమ్మూకశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని వివరించారు. అస్తిత్వం కొల్పోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత గవర్నర్ సత్యపాల్ మాలిక్ పారా మిలిటరీ ఫోర్స్, పోలీసుల బలగాల సైనిక వందనాన్ని స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని  ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి వరకు అక్కడ పోలీసులు భారీ భద్రత చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే 144 సెక్షన్ విధించారు. ఇప్పుడు వాటిని ఎత్తివేయడంతో జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ మృతి

Satyam NEWS

సెక్స్ రాకెట్ గుట్టు దాచేందుకే బిజెపి నేత శ్వేతను హతమార్చిన భర్త

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

Satyam NEWS

Leave a Comment