28.2 C
Hyderabad
April 20, 2024 11: 34 AM
Slider ప్రపంచం

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

#IndianTroops

దాదాపు రెండున్నర నెలల అనంతరం భారత్ చైనాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాక్ లో ఏర్పడిన ప్రతిష్టభన పరిష్కరించుకోవడం కోసం భారత్ చైనా సైనిక అధికారుల మధ్య రెండున్నర నెలల కిందట చర్చలు జరిగి అర్ధంతరంగా నిలిచిపోయాయి.

తొమ్మిదవ విడత కమాండర్ స్థాయి చర్చలు నేడు పూర్తి అయ్యాయి. తూర్పు లద్దాక్ లోని వివాదాస్పద ప్రాంతాల పై ఇరు దేశాల కమాండర్లు చర్చలు జరిపారు. వివాదాస్పద ప్రాంతాలపై నవంబర్ 6న జరిగిన చర్చల తర్వాత మళ్లీ ఇరుదేశాల కమాండర్లు కలిసి మాట్లాడుకున్నారు.

ఏడవ దఫా చర్చల సందర్భంగా వివాదాస్పద ప్రాంతాల నుంచి భారత్ వైదొలగాలని, అక్కడ నుంచి సైనిక బలగాలను ఉప సంహరించుకోవాలని చైనా షరతులు విధించింది. అయితే దానికి భారత్ అంగీకరించలేదు. సైనిక బలగాల ఉప సంహరణ రెండు పక్షాల నుంచి ఒకే సారి జరిగితేనే తాము అంగీకరిస్తామని భారత్ తేల్చి చెప్పింది.

దాంతో ఎనిమిదవ రౌండు చర్చలు జరిగాయి. ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతాలలో దాదాపు 50 వేల మంది సైనికులు ఇంకా మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపుగా అంతే సంఖ్యలో సైనికులను మోహరించి ఉంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో సైనికులు అక్కడ పహారా కాస్తున్నారు.

Related posts

నేతన్న చేతులు నాకుతున్న అవినీతి అధికారులు

Satyam NEWS

మెడికో మర్డర్:వైద్య విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు

Satyam NEWS

అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం

Satyam NEWS

Leave a Comment