30.7 C
Hyderabad
April 19, 2024 09: 51 AM
Slider ప్రపంచం

జో బిడెన్ కే భారత సంతతి అమెరికన్ల ఓట్లు

#JoeBiden

సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తన వెనక ఉన్నట్లు ప్రచారం చేసుకున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారత సంతతి ఓటర్లు కలిసిరావడం లేదు.

తాజాగా నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది భారతీయ సంతతి అమెరికన్లు డెమెక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ కే మద్దతు ఇస్తున్నట్లు తేలింది.

డోనాల్డ్ ట్రంప్ కు కేవలం 22 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు.

మరో 3 శాతం ఇద్దరికి కాకుండా మూడో అభ్యర్ధికి మద్దతు ఇస్తామని చెబుతున్నారు కానీ ఈ మూడు శాతం మంది ఓటింగ్ కు వచ్చే అవకాశం కూడా లేదని సర్వేలో తేలింది.

డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ భారత సంతతి ఓటర్లను ఆకట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

 2000 నుంచి 2018వ సంవత్సరం మధ్య కాలంలో అమెరికాలో భారతీయ సంతతి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారుగా 150 శాతం మేరకు పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో ప్రవాసులుగా ఉంటున్న జాతులలో భారతీయ అమెరికన్లు రెండో స్థానంలో ఉన్నారు.

Related posts

కరోనా హెల్ప్: మీడియా మిత్రులకు యాదవ సంఘం సహాయం

Satyam NEWS

ఉద్యోగ ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

ఆహ్వానం …

Satyam NEWS

Leave a Comment