27.7 C
Hyderabad
April 19, 2024 23: 58 PM
Slider ప్రపంచం

భారత్ లో రైతుల ఆందోళనపై బ్రిటన్ లో చర్చ

#Boris Johnson

భారత్ లో జరుగుతున్న వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనలు వాటిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో కొందరు సభ్యులు వెలిబుచ్చిన భయాందోళనలను బ్రిటన్ లోని భారత హైకమిషనర్ కొట్టిపారేశారు.

భారత్ పై ఉన్న అభిమానంతోనో, ప్రేమతోనో లేదా స్నేహాన్ని దృష్టిలో ఉంచుకునో చేస్తున్న కొన్ని అభూతకల్పనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత హైకమిషనర్ స్పష్టం చేశారు. భారత్ పై ప్రేమతో కొందరు బ్రిటన్ నాయకులు వెలిబుచ్చుతున్న ఆందోళనలు అర్ధరహితమని వెల్లడించారు.

అయితే హౌస్ ఆఫ్ కామన్స్ లో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలపై బ్రిటన్ రాజ్య మంత్రి నైజిల్ ఆడమ్స్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. యుకే భారత్ మధ్య నిరంతరం జరిగే చర్చలలో ఈ అంశం కూడా ఒక భాగంగా ఉంటుందని మాత్రమే ఆయన అన్నారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో భారత్ పర్యటనకు వెళుతున్నారని, ఆ సమయంలో అన్ని విషయాలు మరింత లోతుగా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆడమ్స్ స్పష్టం చేశారు.

Related posts

ఏఎస్ రావునగర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

బిజెపి ఆధ్వర్యంలో రాజంపేట అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులు

Satyam NEWS

భయపడకు నేస్తమా…

Satyam NEWS

Leave a Comment