నైజీరియా సముద్ర దొంగ ల చేతిలో బందీలుగా ఉన్న 19 మంది భారతీయులను విడిచిపెట్టారు. ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న 20 మంది భారతీయులను గత నెలలో నైజీరియా సముద్ర దొంగలు కిడ్నాప్ చేసారూ. ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్‌టీ డ్యూక్ పడవలో వెళుతున్న 20 మందిని డిసెంబర్ 15న సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు.
ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు