37.2 C
Hyderabad
April 19, 2024 14: 15 PM
Slider నల్గొండ

ఘనంగా ఇందిరాగాంధీ 105వ, జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శనివారం స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ 105వ,జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఉక్కు మహిళగా వాసికెక్కి అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా పనిచేశారని అన్నారు.భారతదేశానికి సుస్థిర పాలన అందించిన ఘనత ఇందిరాగాంధీ కే దక్కిందని, బడుగు,బలహీన వర్గాల పాలిట దైవంగా మారిన ఆదర్శమూర్తి అని అన్నారు.కేంద్ర,రాష్ట్రాల్లో ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని ఉత్తమ్ అన్నారు.16 సంవత్సరాలు దేశ ప్రధానిగా తన సేవలు అందించి భారతదేశాన్ని అగ్ర దేశాల సరసన నిలబెట్టారని,20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం, రాజాభరణాల రద్దు,బ్యాంకుల జాతీయకరణ,హరిత విప్లవం,డ్వాక్రా పథకంతో పాటుగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయడం,పేద ప్రజలకు భూముల పంపిణీ వంటి పథకాలు ఇందిరాగాంధీ చేశారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క నాయకుడు,కార్యకర్త,అభిమాని కంకణ బద్ధులై కృషి చేయాలని అన్నారు.రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,బాచిమంచి గిరిబాబు, జక్కులమల్లయ్య,యోహాన్, లచ్చిమల్ల నాగేశ్వరరావు,ముశం సత్యనారాయణ,పోతుల జ్ఞానయ్య,చప్పిడి సావిత్రి,దొంతగాని జగన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS

ఇప్పటికైనా పరీక్షలు రద్దు చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి

Satyam NEWS

కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్న జగన్

Bhavani

Leave a Comment