21.2 C
Hyderabad
December 11, 2024 21: 57 PM
Slider ప్రపంచం

ఇండోనేషియాను గజగజ వణికించిన భూకంపం

indonesiaearthquake2-1

భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండోనేషియా ఓ ‍ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఇండోనేషియా భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్‌ నికోబార్‌ దీవులనూ తాకింది. గురువారం అర్థరాత్రి నికోబార్‌ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ,  ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Related posts

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి

Satyam NEWS

హెటిరో సంస్థలో దొరికిన డబ్బు టీఆర్ఎస్ పార్టీదే

Satyam NEWS

తల్లి పీకపై కాలుతో తొక్కుతున్న కిరాతకుడు

Satyam NEWS

Leave a Comment