మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ స్టేషన్ వద్ద ఇండోర్-జబల్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ ఫామ్ పైకి వెళ్తుండగా రెండు కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది. ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22191) “డెడ్ స్టాప్ స్పీడ్” వద్ద పట్టాలు తప్పింది. పశ్చిమ మధ్య రైల్వే, CPRO, హర్షిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “రైలు ఇండోర్ వస్తోంది. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 వద్దకు చేరుకోగానే, ముందు ఉన్న రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన జబల్‌పూర్ స్టేషన్ నుంచి 100-150 మీటర్ల దూరంలో ఉదయం 5.50కి జరిగింది” అని పేర్కొన్నారు.
previous post