25.2 C
Hyderabad
October 15, 2024 12: 20 PM
Slider తెలంగాణ

ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పరిశ్రమలకు ఊతం

ktr indus

విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తు కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని ఈ యువ పారిశ్రామికవేత్తలు నిరూపించారు అని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం కింద 2019 బ్యాచ్ కోసం 100 మంది పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేసిన సందర్భంగా గచ్చిబౌలి, ఐఎస్ బిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటిఆర్, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్.బిఐ డిజిఎం దేబాశిష్ మిశ్రా,  ఐఎస్ బి డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ పట్టుదల, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పడానికి సిఎం కేసిఆర్ ను మించిన ఉదాహరణ లేదన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను పట్టుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమంటే…దానిని సుసాధ్యం చేసి నిలుపడానికి ఆయన పట్టుదల, నిరంతర కృషియే కారణం అన్నారు. అలాగే ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక వేత్తలుగా ఎంపికైన గిరిజన యువతను చూస్తుంటే వారికున్న ఆసక్తి, పట్టుదల కనిపిస్తోందన్నారు.

తాను విదేశాలకు వెళ్లినప్పుడు పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తూ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాని, అయితే ఈరోజు ఈ గిరిజన ఔత్సాహికులకు పారిశ్రామికవేత్తలు అయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషం, సంతృప్తి అప్పుడు కలగలేదన్నారు. పెద్ద, పెద్ద పరిశ్రమలు ఉన్నా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలు కొత్తగా పెట్టిన ఉన్నత స్థాయిలో ఉంటాయని, రాను, రాను కొన్నిసార్లు నష్టాల్లోకి కూరుకుని ముందుకు నడిపించడమే కష్టంగా మారుతాయని, అలాంటి వారికి వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు.

దీనిద్వారా ఏదైనా పరిస్థితుల్లో ఒకటి, రెండు ఇన్ స్టాల్ మెంట్లు బ్యాంకులకు కట్టలేకపోతే ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కులలో గ్రామీణ యువతకు, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐఎస్ బిలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో పరిశ్రమలు పెట్టే ప్రతి  ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను వస్తానని, తనతో పాటు సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిగా అండగా ఉంటానని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు.  సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయకుండా, ఆసక్తి, పట్టుదల కోసం వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారికి ఇండస్ట్రియల్ పార్కులలో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. మంచి శిక్షణ ఇచ్చి, వీరిని పారిశ్రామికవేత్తలుగ మార్చేందుకు తోడ్పడిన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని, అధికారులను ఆయన అభినందించారు. 

Related posts

ఒక సలహాదారుడిపై ఏపీ సర్కార్ వేటు

Satyam NEWS

మహిళలు నిర్ణయాధికారులుగా ఎదగాలి

Satyam NEWS

అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే లక్ష్యం

Murali Krishna

Leave a Comment