34.2 C
Hyderabad
April 19, 2024 20: 59 PM
Slider హైదరాబాద్

సిబిఐటి విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

#coldstorage

సిబిఐటి – స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,  రెండవ సెమిస్టర్ ఎమ్ బిఎ  విద్యార్థుల శామీర్‌పేటలోని కోల్డ్‌రష్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పారిశ్రామిక సందర్శన చేసారు.  ఈ పారిశ్రామిక సందర్శన లక్ష్యం విద్యార్థులు చల్లని గిడ్డంగి సౌకర్యాలు, సమగ్ర జాబితా మరియు లాజిస్టిక్స్ ఆచరణాత్మక అంశాలను ఆచరణాత్మకత ద్వారా  నేర్చుకోవడం కోసమని ఈ ఇండస్ట్రియల్ విజిట్ హెడ్, ఎస్ఎంఎస్ మరియు ఆర్గనైజర్ డా.ఎస్.సరస్వతి చెప్పారు. సరస్వతి మాట్లాడుతూ విద్యార్థులు పారిశ్రామిక జ్ఞానాన్ని పొందేలా చేయడానికి ఎస్ఎంఎస్ విభాగం తరచుగా తరగతి గది బోధనను పారిశ్రామిక సందర్శనలతో విద్యార్థులకు పాఠ్యబోధన చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బం గా విద్యార్థులు వివిధ ఉష్ణోగ్రతల వివిధ శీతల గదులు, డ్రై స్టోరేజీ వేర్‌హౌస్ సౌకర్యాలు మొదలైన వాటిని సందర్శించారు.

వేర్‌హౌస్ హెడ్ మహమ్మద్ ఆరిఫ్  విద్యార్థులను వారి గిడ్డంగి సౌకర్యాల చుట్టూ తీసుకువెళ్లి, ఘనీభవించిన యూనిట్లు, చిల్లర్లు మరియు యాంబియంట్ వేర్‌హౌసింగ్‌తో కూడిన కోల్డ్ స్టోరేజీ వేర్‌హౌసింగ్ సౌకర్యాల గురించి వివరించారు.  ఈ సందర్శనలో ఇతర అధ్యాపకులు లావణ్య,  డాక్టర్ జ్యోతి, సంగీత పాల్గొన్నారు.

Related posts

విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదు?

Satyam NEWS

ట్రాజెడీ: గుండెపోటుతో రాజధాని రైతు మృతి

Satyam NEWS

అశోక్ గజపతి రాజును మళ్లీ అవమానించిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment