30.3 C
Hyderabad
March 15, 2025 09: 04 AM
Slider ముఖ్యంశాలు

కరోనా సోకి హైదరాబాద్ లో ఒక పసికందు మృతి

#Corona Picture

తల్లికి కరోనా లేకుండా బిడ్డకు ఆ వ్యాధి సోకి మరణించడం హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. కుతుబ్బుల్లా పూర్ కు చెందిన ఓ మహిళ ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ, క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రసవానికి ముందే తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు చేశారు.

వారి కుటుంబంలో కూడా ఎవరికి కరోనా లక్షణాలు లేవు. ఈ క్రమంలో ఆస్పత్రిలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా, అనుమానం కలిగినా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Related posts

రూపాయి బలహీనపడటం లేదు.. డాలర్ బలపడుతున్నది…

Satyam NEWS

మాతృమూర్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

కేంద్రం నిధులకు బొమ్మా బొరుసు

Satyam NEWS

Leave a Comment