అడిగిన సమాచారం ఇవ్వని మునిసిపల్ అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ మరో మారు నోటీసు జారీ చేసింది. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం లోని స్వర్ణ రోడ్ లో సర్వే నెంబర్ 252/5 లో కారం శెట్టి శ్రీనివాసరావు డోర్ నెంబర్ 17- 1 – 22 లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి సంబంధించిన అనుమతుల సమాచారాన్ని విజిల్ బ్లోయర్ నాయుడు నాగార్జున రెడ్డి కోరారు. అయితే సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్న చీరాల మున్సిపల్ అధికారుల పై రాష్ట్ర సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో విచారించిన రాష్ట్ర సమాచార కమిషన్ రెండవ సారి చీరాల మున్సిపల్ అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
చీరాల పట్టణంలో ఆమంచి కృష్ణ మోహన్ శాసనసభ్యుడిగా కొనసాగిన కాలంలో అతని అండదండలతో మాజీ మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు తన బినామీ కారం శెట్టి శ్రీనివాసరావు ఎలియాస్ పాపాయి పేరుతో నిర్మించిన అక్రమ బహుళ అంతస్తుల భవనమునకు సంబంధించిన సమాచారాన్ని నాగార్జున రెడ్డి కోరారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 27న దరఖాస్తు చేసిన నాయుడు నాగార్జున రెడ్డి కి చీరాల మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో రాష్ట్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు.
విచారించిన సమాచార కమిషన్ పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కమిషన్ ఆదేశాలను సైతం ధిక్కరించిన చీరాల మున్సిపల్ అధికారులు పూర్తి సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో మళ్ళీ దరఖాస్తుదారుడు నాగార్జున రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్ show cause notice in case number 3623/SIC- KJR/ 2020 issued under section 20 of RTI act 2005 date 14.09.2021 జారీ చేసి అక్టోబర్ 7వ తేదీ 10 గంటల 30 నిమిషాలకు స్వయంగా మిషన్ ముందు హాజరు కావాల్సిందిగా, సంబంధిత సమాచారంతోపాటు సరైన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.